అల్లు అర్జున్ ‘పుష్ప’ప్యాన్ ఇండియన్ లీలలు..?

puspha movie updates
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ పుష్ప టైటిల్ పై ట్రోల్స్ ఉన్నా.. అల్లు అర్జున్ లుక్ కు మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది. చిత్తూరు, తమిళనాడు సరిహద్దుల్లోని ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించిన కథతో వస్తోన్న ఈ సినిమాలో రష్మికమందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.కానీ ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉంది. మామూలుగా దసరా బరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. అందులో ప్రస్తుతం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోన్న వార్తలు రెండు.. ఒకటి కియారా అద్వానీ ఐటమ్ సాంగ్ రెండోది విలన్ గురించి..
భరత్ అనేనేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగులో తనకంటూ ఓగుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత అమ్మడికి ఇక్కడ చాలా ఆఫర్స్ వచ్చినా ఎందుకో ఒప్పుకోవడం లేదు. అలాంటిది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందా అనేది అనుమానాస్పదమైన అంశం. ఒకవేళ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఐటమ్ సాంగ్ అంటే మరీ ఎక్కువ డేట్స్ కేటాయించక్కర్లేదు కదా..? కానీ ఈ వార్తపై ఎలాంటి కన్ఫర్మరేషన్ లేదు.
ఇక రెండోది విలన్ గురించిన మేటర్. ఇప్పటికే సినిమాలో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడని చెబుతున్నారు. అయితే అతను విలన్ నా లేక ఫారెస్ట్ ఆఫీసరా అనేది తేలాల్సి ఉంది. ఈ టైమ్ లో బాలీవుడ్ మాజీ స్టార్ సునిల్ శెట్టిని విలన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అయితే మొదట్లో జగపతిబాబుతో పాటు ఓ కన్నడ నటుడిని విలన్స్ అన్నారు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారింది కాబట్టే.. సునిల్ శెట్టి అంటున్నారు. ఇతను ఆల్రెడీ కన్నడలో పైల్వాన్, తమిళ్ లో దర్బార్ చిత్రాలతో సౌత్ కు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియన్ ట్యాగ్ కూ పనికొస్తాడు. ఏదేమైనా ఇవన్నీ ప్రాజెక్ట్ వెయిట్ పెంచేందుకు కనిపించే అంశాలుగానే ఉన్నాయి. అంటే కేవలం ఈ సినిమాకు భారీ సినిమా అన్న ముద్ర వేయడానికి .. మరి ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article