ఖమ్మం:ఖమ్మం నగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్, షర్మిల మీద ఫైర్ అయిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణకు వచ్చి ఏం పీకుతావ్. ఖమ్మానికి భోగం మేళాలు వస్తుంటాయి..పోతుంటాయి ఎవరూ పట్టించుకోవద్దు. కళ్ళలో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరు కాదా. రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పాలకులు వెళ్లారు అనుకుంటే మళ్లీ తయారయ్యారు. మీ నాయన, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేటు. వుట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్న లాగా డబ్బులిచ్చి తీసుకోవాలా? డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చే సంస్కృతి మీ అన్నది. పని చేసిన వారికే కేసిఆర్ గుర్తించి పదవులు ఇస్తారు, అందుకు నేను గర్విస్తున్నాను. షర్మిల దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించు,పాలేరులోను నా దమ్ము చూపిస్తా. బయ్యారం ఉక్కు డబ్బుకు పోవాలని పోవాలని చూశారు..ఉక్కు నుంచి భూములు వరకు అన్నీ కబ్జాలు దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే.