పీవీ సింధు కు పువ్వాడ అభినందనలు

223
Puvvada congratulations to PV Sindhu
Puvvada congratulations to PV Sindhu

◆ తల్లిదండ్రులు వాలీబాల్ ప్లేయర్స్, తండ్రి అర్జున్ అవార్డ్ గ్రహీత.

◆ ఖమ్మంలో నిర్వహించే అభినందన సభకి రావాలని ఆహ్వానం.. వస్తానని హామీ ఇచ్చిన సింధు.

టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలియజేశారు. ఒలింపిక్స్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సింధు నివాసానికి వెళ్లి తనను కలిసి అభినందలను తెలియజేశారు. శాలువతో సత్కరించి, శ్రీశ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఇరువురు వాలీబాల్ క్రీడాకారులు రమణ, విజయ లను కలిసి అభినందనలు తెలిపారు. రమణ గారు సైతం అర్జున్ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా ఒలింపిక్స్కు సిద్ధం అయిన తీరు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తన మెడల్స్ రూమ్ కి తీసుకెళ్లి పతకాలను వివరించారు. ఒలింపిక్స్ లో వచ్చిన పథకం, అర్జున్ అవార్డు, తదితర పథకాలను చూపించి వాటి ప్రాముఖ్యత ను మంత్రికి వివరించారు. ఖమ్మం క్రీడాకారుల కోరిక మేరకు ఖమ్మం లో చేపట్టే సన్మాన వేడుకకు రావాలని మంత్రి పువ్వాడ కోరారు. అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసి వచ్చేందుకు అంగీకరించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
వరుసగా రెండు ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిందన్నారు. వరుసగా ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించడం గర్వించదగ్గ విషయమని, రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. భారత బ్యాడ్మింటన్ కి సింధు ఐకాన్ గా మారిపోయిందని, వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సింధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటూ, ప్రోత్సాహం అందిస్తుందని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here