ఇక రైతు కూలీలే మిగులుతారు!

రైతుబంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచార‌ని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశాన‌ని.. ఈ నెల 14న 37వ సినిమా రైతన్న విడుదలవుతుంద‌ని.. అందరూ ఆదరించాలని కోరారు. కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరంటు చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలుగా మారాయ‌న్నారు. ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు.

కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించింది రైతాంగమ‌ని గుర్తు చేశారు. ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారతదేశానికి మంచివి కావన్నారు. బీహార్ లో మార్కెట్లు ఎత్తేస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడుతున్నారని చెప్పారు. స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదన్నారు. బీహార్లో ఇప్పుడు రైతులు లేరు.. రైతు కూలీలే మిగిలారని వివ‌రించారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే ఈ దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారని విమ‌ర్శించారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాల‌ని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article