ప్రభాస్ ఇంటర్వ్యూలు రద్దు కావడంతో అందరికీ స్పష్టత వచ్చేసింది. ట్రిపుల్ ఆర్ మాదిరిగానే రాధే శ్యామ్ కూడా విడుదల కావట్లేదని అర్థమైంది. దీనిపై ప్రభాస్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి రాధేశ్యామ్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయితే కుదరదు. దేశవ్యాప్తంగా విడుదల అయితేనే పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుంది. రాధే శ్యామ్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశముంది. ఆర్ఆర్ఆర్, రాజమౌళిపై ఇప్పటికే నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అంటే “రాను, రాలేను, రాలేకపోతున్నాను” అని మార్చేశారు. ఈ కన్ఫ్యూజన్ సందర్భంగా రాధేశ్యామ్ నిర్మాతలు 14న రిలీజ్ పక్కా అంటూ పోస్టర్లు విడుదల చేశారు. కానీ ప్రభాస్ మాత్రం తన ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేయడంతో రాధేశ్యామ్ రావట్లేదని అర్థమైంది.