రాధిక హత్యకేసు మిస్టరీ .. తండ్రే కాలయముడు

Radhika murder accused arrested
కరీంనగర్ లో సంచలనం సృష్టించిన  ఇంటర్ విద్యార్థిని రాధిక హత్యకేసు మిస్టరీ వీడింది. అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ఖర్చులు పెట్టలేక కన్నతండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, 19 సంవత్సరాల తన కూతురును గొంతుకోసి అతి దారుణంగా చంపారని పోలీసులు తెలిపారు. కరీంనగర్ పట్టణం విద్యానగర్ చెందిన ముత్త కొంరయ్య గోదాంగడ్డ లోని గోడౌన్ లో హమాలి పని చేస్తుండే వాడు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం, పోలియోతో బాధపడుతున్న తన కూతురు ముత్త రాధికను చికిత్స నిమిత్తం అనేక హాస్పిటల్స్  తిరిగి చికిత్స చేయించాడు. చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టగా ఆరోగ్యం బాగుపడడంతో  ఒక సంవత్సరం క్రితం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజిలో రాధికను  ఇంటర్ మొదటి సంవత్సరం లో చేర్పించాడు. గత కొద్ది రోజుల నుండి రాధిక మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మళ్ళీ డబ్బులు ఖర్చుపెట్టి నయం చేయించే స్థోమత లేక  కొంరయ్య విసుగు చెంది.. ఎలాగైనా తన బిడ్డను చంపాలని నిర్ణయించుకొని పక్కా ప్లాన్ వేసి మరీ హతమార్చాడు .
కొంరయ్య తన బిడ్డ రాధిక బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి,అదే అదునుగా భావించి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ,  బరువైన దిండును తీసి రాధిక ముఖంపై అదిమిపెట్టి  ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా రాధిక మృతదేహాన్ని బెడ్ పై నుండి కింద పడేసి, కిచెన్ లో గల కత్తి తీసుకువచ్చి, విచక్షణ రహితంగా ఆమె మెడని కోశాడు.  రక్తపు మరకలు అంటిన కత్తిని కడిగాడు. బనియన్ ను ఉతికి మేడపై ఆరేసి, తిరిగి ఇంట్లోకి వచ్చి తాపీగా భోజనం చేసి ఆ తర్వాత  గోదాం కి సైకిల్ పై వెళ్లాడు. వెళ్లే ముందు ఇంట్లోని సెల్ఫ్ లో గల తన భార్య చైన్ ని  బియ్యం బస్తాలో  కనపడకుండా దాచిపెట్టాడు. పని వద్దకు వెళ్ళాక ఎవరికి అనుమానం రాకుండా తన భార్యకు, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడి, ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నాడు. యథా ప్రకారం తన రోజువారీ హమాలి పని చేశాడు. కానీ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు సిసి కెమెరాలు,పాత నేరస్తుల కదలికలు, సైబర్ ఫోరెన్సిక్ టెక్నిక్స్, వీడియో ఎన్హన్స్మెంట్ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించి నేరం చేసింది రాధిక తండ్రి కొమరయ్య నే అని నిర్ధారించారు. తమదైన స్టైల్ లో విచారణ జరపగా కొమరయ్య పఒప్పుకున్నారు .
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article