రాఫెల్ డీల్ రివ్యూ పిటీషన్లు కొట్టివేస్తూ సుప్రీం తీర్పు

Raffel Deal Review Petitions Supreme Court Dismissing

సుప్రీం ధర్మాసనం ఈ రోజు రాఫెల్ డీల్ పై అతి కీలకమైన తీర్పును వెలువరించింది. రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్లను కొట్టివేసింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన రఫేల్ యుద్ధ విమానాల డీల్ లో అవకతవకలు జరిగాయని దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కొట్టివేసింది. రఫేల్ డీల్ వెనుక మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడిందని గతంలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, తీర్పును నేడు వెలువరించింది. ఈ డీల్ వెనుక ఎటువంటి అక్రమాలూ లేవని, నిబంధనల ప్రకారమే డీల్ కుదిరిందని అభిప్రాయపడింది. గతంలో తామిచ్చిన తీర్పునకు కట్టుబడే ఉంటున్నామని స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 14న రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ పై తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, అప్పటివరకూ ఉన్న కేసులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం, అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

tags : raffel deal, france, irregularities, jet filghts, supreem court, dismiss, review petitions

పెట్రోల్ బాటిల్ తో రెవెన్యూ ఆఫీస్ లో హల్ చల్

మహబూబాబాద్ లో  మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *