ఇంకా రాఘవేంద్రజాలం సాధ్యమా..?

40
Director Raghavendar New movie

raghavendra rao movie

తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన దర్శకుడ కె రాఘవేంద్రరావు. కథల కంటే హీరోయిజాన్నే ఎక్కువ నమ్ముకున్న దర్శకుడు కూడా ఆయనే. ఎన్టీఆర్ కు మాస్ హీరోగా సెకండ్ లైఫ్ ఇచ్చింది.. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో ముందుందీ రాఘవేంద్రుడే. యాంగ్రీ మేన్ రాజశేఖర్ ను లవర్ బాయ్ ని చేశాడు. శ్రీకాంత్ వంటి స్ట్రగులింగ్ హీరోతో పెళ్లి సందడి చేసి అతనికి స్టార్ స్టేటస్ ఇచ్చాడు. మెగాస్టార్ నుంచి మినీ స్టార్ వరకూ ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన చరిత్ర ఈ దర్శకేంద్రుడిది.  హీరోయిన్ల విషయంలో కాస్త అతి చేసినట్టుగా కనిపించినా.. ఆ శృంగారాన్ని కూడా ఆడియన్స్ చేత మెప్పించాడు. రాఘవేంద్రరావు బిఏ అని రాసుకున్నా.. ఆ బిఏకు అర్థం  బొడ్డు, ఆపిల్స్ అని పరిశ్రమ మరో రకంగా చెప్పుకుంది. అలాంటి రాఘవేంద్రరావు.. సడెన్ గా భక్తి సినిమాలకు వచ్చాడు. రక్తి సినిమాలు తీసే అతను భక్తి చిత్రాలేంటీ అన్నారు. కానీ అన్నమయ్యతో అద్భుతమైన హిట్ అందుకుని తర్వాత శ్రీ రామదాసుతో తనలోని మరో యాంగిల్ చూపించాడు. మొత్తంగా టాలీవుడ్ లో కమర్షియల్ గా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటాడు. అయితే వయసు మీద పడటంతో పాటు ట్రెండ్ ను అందిపుచ్చుకోవడంలో అందర్లానే వెనకబడ్డాడు. దీంతో ఈ తరానికి రాఘవేంద్రరావు అంటే భక్తి సినిమాల దర్శకుడు అనిపించినా ఆశ్చర్యం లేదు. ఆయన చివరగా తీసిన నమో వెంకటేశాయ అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా దర్శకత్వానికి కామా పెట్టాడు.

లేటెస్ట్ గా పెళ్లి సందడి మళ్లీ అంటూ ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సారి అంత సందడి కనిపిస్తుందా అనేది అందర్లోనూ వినిపిస్తోన్న డౌట్. పైగా ఆ పెళ్లి సందడి టైమ్ లో తెలుగు కల్చర్ ఒకలా ఉంది. ఇప్పుడు పూర్తిగా మారింది.మరి ఈ ట్రెండ్ ను రాఘవేంద్రుడు అందిపుచ్చుకుంటాడా.. అనేది సమస్యే. అయితే కొన్ని కథలు డీల్ చేయడంలో అతను ది బెస్ట్ అనిపించుకుంటాడు. ఇలాగే ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడే మంచి హిట్సూ ఇచ్చాడు. అందుకే కొత్తవారితో చేస్తోన్న ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అంటున్నారు. అదే టైమ్ లో ఈ సినిమా విజయం సాధిస్తే తర్వాత తన తరం హీరోలతో సినిమా చేయడానికీ కొత్త ఉత్సాహం వస్తుంది. మొత్తంగా అప్పటి పెళ్లి సందడిలాగానే రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడని ఫీలర్స్ చెబుతున్నాయి. అందుకోసమే మరోసారి కీరవాణిని సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. మరి ఈ సందడి ఆ సందడిని మరిపిస్తుందా లేక.. సందడే లేకుండా పోతుందా అనేది చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here