మోసపూరిత మెసెజ్ ని నమ్మొద్దు

62
  • సీఎండీ జి రఘుమా రెడ్డి

విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం మూలంగా రాత్రి 10.30 తరవాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, అలా విద్యుత్ సరఫరా నిలివేయకుండా ఉండేందుకు, బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్ అధికారికి 9692848762 నెంబర్ కు కాల్ చేయగలరనే మోసపూరిత మెసేజ్ లు పంపి విద్యుత్ వినియోగదారులను మోసగిస్తున్నారని సంస్థ దృష్టికి వచ్చింది.

గతంలో కూడా విద్యుత్ వాడకం బిల్లుల చెల్లింపు పేరుతొ కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్ ల ద్వారా/ ఫోన్ ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మోసపూరితంగా వినియోగదారులను బెదిరించి వారి బ్యాంకు అకౌంట్ మరియు డెబిట్ కార్డు వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుండి నగదును విత్ డ్రా చేసుకుని మోసం చేసిన దాఖలాలు కూడా వున్నాయి.

ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు తెలియజేయడమేమనగా, ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తమకు ఫోన్ చేసి గాని/ మెసేజ్ ద్వారా గాని విద్యుత్ బిల్లు పెండింగ్ లో వున్నది అని పేర్కొంటే తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com మరియు TSSPDCL మొబైల్ ఆప్ లో సరి చూసుకోవాలి. రాత్రిపూట/అర్ధరాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేయడం సంస్థ చేయదు. పెండింగ్ బిల్లుల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేత అనే మెసేజ్ లకు స్పందిచవద్దు, వెంటనే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here