ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఈసం రితిక్ అనే విద్యార్థి శనివారం ఉదయం ఎలర్జీ లోషన్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దిగువ తరగతి విద్యార్థులను తరచుగా కొట్టడం, వేధింపులకు పాల్పడుతున్నా, వార్డెన్ పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు ప్రచారం సాగుతోంది.
ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ రితిక్ ను సహచర విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి తెలపగా వెంటనే అతన్ని తొలుత గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేర్పించి ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గూడూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.