సొంత బామ్మర్దినే కడతేర్చిన బావ

మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో సొంతబామ్మర్ది షాబుద్దీన్ ను కత్తితో పొడిచి చంపిన బావ రహీం ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని జమ్మిగడ్డలో శుక్రవారం ఆర్ద రాత్రి చోటు చేసుకుంది .. ఇక వివరాల్లోకి వెళితే పట్టణములోని జమ్మిగడ్డకు చెందిన రహీం ,శాబుద్దీన్ లు బావ బామ్మర్దులు కాగా రహీం తాగుడుకు బానిసై భార్య పిల్లలకూ దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు,,, అయితే రహీం భార్య పిల్లలతో ఆమె తల్లి దండ్రుల వద్ద కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తూ జీవనం కోన సాగిస్తోంది… అయితే వీరికి 13 సంత్సరాల క్రితం వివాహం కాగా ఈ క్రమంలో బామ్మర్ది శాబుద్ధీన్ పై రహీం కొంత కాలంగా గతంలో జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకొని రాత్రి శాబుద్దీన్ ఇంటికి వచ్చి తనకు డబ్బులు కావాలని నిలదీయడం తో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రహీం తన వెంట తెచ్చుకున్న కత్తితో చాతి పై బలంగా రెండు కత్తిపోట్లు పొడవడంతో స్థానికులు,,, బంధువులు అప్రమత్తమై వెంటనే శాబుద్ధీన్ ని సూర్యాపేట జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధృవీకరించారు. మృతుని బంధువుల పిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలంచి కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు నిందితుడు రహీం ను పోలీసు అదుపులో కి తీసుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article