అతిగా స్పందించొద్దు

RAHUL DRAVID ON PANDYA ROW

  • హార్థిక్, రాహుల్ వివాదంపై ద్రవిడ్ వ్యాఖ్య

టీమిండియా క్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని భారతజట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంశంపై ఓవర్ గా రియాక్ట్ కావొద్దని పేర్కొన్నాడు. మైదానంతోపాటు బయట ఉండే సవాళ్ల పట్ల ఆటగాళ్లకు చక్కని అవగాహన కల్పించాల్సిన అవసరముందని స్పష్టంచేశాడు. ఇప్పటికే ఇండియా ఏ, అండర్‌ 19 క్రికెట్లో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపాడు. వాస్తవానికి ఆటగాళ్ల ప్రవర్తనపై నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ ఉంటుందని, అయితే, వారి తీరిక లేని షెడ్యూల్ వల్ల ఈ శిక్షకు ఎక్కువ మంది హాజరుకాలేకపోతున్నారని వివరించాడు. గతంలో ఆటగాళ్లెవరూ ఇలాంటి పొరపాట్లు చేయలేదని నేను అనడంలేదు. వర్క్ షాపులు నిర్వహించి, వారికి అవగాహన కల్పించినంత మాత్రాన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని కచ్చితంగా చెప్పలేం. అయితే, పాండ్యా, రాహుల్‌ వివాదం తరహాలో ఏవైనా ఘటనలు జరిగితే ఇంత అతిగా స్పందిచొద్దు. వివాదాస్పద వ్యాఖ్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తపడాలి కానీ, ఘటన జరిగిన తర్వాత వకాల్తా పుచ్చుకొని ఇష్టారీతిన కామెంట్లు చేయొద్దు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆటగాళ్లు మసలుకోవాలి. భారత ఆటగాడిగా తమపై ఉన్న గురుతర బాధ్యతల్ని ఏ ఒక్క ఆటగాడూ మరచిపోకూడదు’ అని ద్రవిడ్ స్పష్టంచేశాడు.

‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్‌, రాహుల్ జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. వారిపై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్ ఈ అంశంపై స్పందించాడు. ఒక్కో ఆటగాడు ఒక్కో నేపథ్యం నుంచి జట్టులోకి వస్తాడని, వ్యవస్థను తప్పుబట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించాడు. తాను కర్ణాటక సీనియర్‌ ఆటగాళ్లు, తల్లిదండ్రులు, పెద్దల నుంచి  చాలా విషయాలు నేర్చుకున్నానని.. చుట్టూ ఉన్నవారిని గమనించి మంచి విషయాలు అలవర్చుకున్నానని వెల్లడించాడు.

SPORTS UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article