హాలీవుడ్ హీరోగా కామెడీ నటుడు

RAHUL RAMAKRISHNA TO HOLLYWOOD

బ్లాక్ బస్టర్ సినిమా అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా, క్లినిక్ లో పనిచేసే డాక్టర్ గా నటించిన రాహుల్ రామకృష్ణ.. హాలీవుడ్ లో ఆరంగేట్రం చేయనున్నారు. సిల్క్ రోడ్ అనే సినిమాలో ఆయన కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ స్వయంగా వెల్లడించారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రాహుల్.. తర్వాత ‘భరత్‌ అనే నేను’, ‘సమ్మోహనం’, ‘గీత గోవిందం’, ‘హుషారు’ వంటి చిత్రాల్లో మెప్పించారు. కామెడీ యాక్టర్ గా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. తాజాగా హాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రదీప్‌ కటసాని నిర్మిస్తున్న సిల్క్ రోడ్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నారు. అమెరికాలో జీవించే తెలుగు విద్యార్థి జీవితం నేపథ్యంలో ఈ సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. లాస్‌ ఏంజెల్స్‌లో సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌ చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్‌ సీరియస్‌ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ సందర్భంగా రాహుల్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ వార్త నేను ఊహించిన దానికంటే వేగంగా బయటికి వచ్చింది. నేను ఇన్నాళ్లూ ఎదురుచూసిన నా డ్రీమ్‌ ప్రాజెక్టు ఇది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నా. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొంటూ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ చేశారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article