రాహుల్ రాజీనామా లేఖ ట్విట్టర్ లో పోస్ట్ .

Rahul Resignation Posted in twitter

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు వద్దని చెప్పిన రాహుల్ గాంధీ… పట్టు విడవడం లేదు. ఇకపై తాను పార్టీ అధ్యక్షుడిని కాదని… ఆలస్యం చేయకుండా తక్షణమే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నాయకులను కోరారు. అధ్యక్ష పదవికి తాను ఇప్పటికే రాజీనామా చేశానని చెప్పారు. సీడబ్ల్యూసీ వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని విన్నవించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్ నేతలంతా కోరుతున్నప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.

ఈ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. తాజాగా తన రాజీనామాను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై అపరిమితమైన ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తన రాజీనామా లేఖను రాహుల్ జతచేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article