చంచల్ గూడ జైలు దగ్గరకు రైల్వే ఘటన నిందితుల కుటుంబాలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ఆరెస్టయి చంచల్ గూడ జైలు లొ వున్నఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం జైలు వద్దకు చేరుకున్నారు. అరెస్టయిన తమ పిల్లల్ని ములాకత్ ద్వారా కలుసుకునేందుకు బాధిత కుటుంబాలు వచ్చాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి సుబ్బారావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సుబ్బారావు కు బెయిల్ మంజూరు చేయాలని నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. .తమ పిల్లలు జైల్లో ఉండటంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తన పిల్లల్ని బయటికి తీసుకు రావాలని వేడుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article