దక్షిణ మధ్య రైల్వేలో 12,433 పోస్టుల భర్తీ

RAILWAY JOBS

  • ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం
  • దేశవ్యాప్తంగా 1.31 పోస్టుల భర్తీకి చర్యలు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇప్పటికే పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న కేంద్రం.. తాజాగా రైల్వేపై దృష్టి సారించింది. రైల్వేలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే సహా ఇతర జోన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీలతోపాటు వచ్చే ఏడాదికి ఖాళీ అయ్యేవాటిని కూడా కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తతం 1.31 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. వీటిలో దక్షిణ మధ్య రైల్వేలో 12,433 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధమయ్యాయి. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరులోపు రానుంది. ఈ 12,433 పోస్టుల్లో అత్యధికంగా లోకోపైలట్ పోస్టులు 3940 ఉండగా.. లోకోపైలట్-2781, టెక్నీషియన్-2475, హెల్పర్-1646, పాయింట్స్ మెన్-884, జూనియర్ ఇంజనీర్-707 పోస్టులు ఉన్నాయి.

EMPLOYMENT NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article