Thursday, March 13, 2025

నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు, ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో ఎండలతో బేజారెత్తిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురు వారాల్లో కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

నేడు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

అకాల వర్షాల వల్ల నష్టానికి గురైన రైతులు
వారం రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలోని కొందరు రైతులు మార్కెట్లో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల వేడిమికి శరీరంలోని నీరు వేగంగా ఆవిరైపోతుందని పలుసార్లు మంచినీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com