నేను రాను బిడ్డో ఉస్మానియాకు!

42
Rain water in osmania hospital
Rain water in osmania hospital

Rain water in osmania hospital

శుక్రవారం కురిసిన భారీ వర్షపునీటికి హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వర్షపు ధాటిగా మళ్లీ ఉస్మానియాలో జలమయంగా మారింది. ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని కోట్లు ఖర్చుచేసినా ఉస్మానియా దుస్థితి మారడం లేదు. పేరుకు పెద్ద ఆస్పత్రి అయినా కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు.

ఉస్మానియా.. మళ్లీ జలమయం

ఇప్పటివరకు డాక్టర్ల కొరత, కనీస వసతులు లేని ఉస్మానియాకు వర్షపు గండం కూడా భయపెడుతోంది. కోట్లు ఖర్చు చేసిన నిర్మించిన షెడ్డు పూర్తిగా కురవడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. నిర్మాణంలో క్వాలిటీ లోపించడంలో షెడ్డులోని రోగులను మరో వార్డుకు తరలించారు. వార్డులు, ఆపరేషన్ థియేటర్లు సైతం వర్షపు నీటితో నిండి కనిపించాయి. ఎంఆర్ఐ, సీటి స్కాన్ అంతస్థుల్లో కూడా వర్షపు నీరు నిలిచింది. పేదల ఆస్పత్రి పెద్దలకు పట్టదా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here