తొలినాళ్లలోనే రైతులు స్పందిస్తే బాగుండేదా?

114
Rajadhani Farmers Protest Against Capital City
Rajadhani Farmers Protest Against Capital City

CBN Comments On Rajadhani Farmers Protest

సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తనతోనే గేమ్స్ ఆడుతున్నారని.. ఇక మీరో లెక్కన అని రైతులతో అన్నారు. దీనిని బట్టి పులివెందుల పంచాయతీ అంటే ఏంటో అర్థమవుతోందని చెప్పారు. అమరావతి రాజధానిని తన కోసం కాకుండా భవిష్యత్ తరాలను ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కానీ రాజధాని పేరుతో బెదిరిస్తే భయపడబోనని, అలిపిరి వద్ద మావోయిస్టులు దాడి చేస్తేనే ధైర్యంగా ఎదుర్కొన్నానని చంద్రబాబు తెలిపారు.

రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురై.. నిరసన చేపడుతుంటే పెయిట్ ఆర్టిస్టులు అని ఓ టీవీ చానెల్ వాళ్ళు  అనడం సమంజసం కాదన్నారు. బిర్యానీ కోసం మీటింగులకు వస్తున్నారని  నిందలు వేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంత రైతులపై ఒక్క కేసు పెడితే 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అదేవిధంగా అమరావతి కోసం త్యాగం చేసేందుకు 5 కోట్ల మంది సిద్దంగా ఉండాలని కోరారు. అమరావతి అంటే అవకాశాలకు పందిరి అని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతి అభివృద్ధి చేసుకోకుండా పొట్ట కూటి కోసం మళ్లీ హైదరాబాద్ వెళ్లాలా అని ప్రశ్నించారు. ప్రజా వేదికను కూలగొట్టినప్పుడు మాకేందుకులే అని అనుకున్నారు. తన ఇళ్లు పడగొట్టినప్పుడు కూడా పట్టించుకోలేదు. చివరికి అమరావతి మునిగిపోతుందని అనే సరికి తమ వరకు వచ్చిందని అనుకొని మేల్కొన్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో మంచి కంటే చెడు జరుగుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.అమరావతి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొంటున్న సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా పంపించేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులు కూడా తొలినాళ్లలోనే స్పందిస్తే బాగుండేదని చంద్రబాబు పేర్కొన్నారు.

CBN Comments On Rajadhani Farmers Protest,Rajadhani Farmers Protest Against Capital City,tdp ,  chandrababu, capital farmers, capital amaravati, chief minister, jagan , ycp government

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here