సీఎల్పీ లీడర్ గా రేసులో ఉన్నానంటున్న రాజగోపాల్ రెడ్డి

[catposts name=” BNMbnm@1234″]Rajagopal Reddy on CLP Leader Race

కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ లీడర్ గా అవకాశమివ్వాలని ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కోరుతున్నారు. ఇక అధిష్టానానికి తమ బలాబలాల గురించి చెప్పుకుంటున్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ గా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అధికార పార్టీ మెడలు వంచే లా పనిచేస్తామని చెప్తున్నారు. ఈనెల 16న సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోనున్న నేపథ్యంలో మరోమారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాటను చెప్పారు.
తన సీఎల్పీ రేసులో ఉన్నానని తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించారు. ఎంపీ గాను, ఎమ్మెల్సీ గాను పనిచేసిన అనుభవం ఉందని అవకాశం ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా మార్చడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తానని ఆయన చెప్పారు.
యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన అక్కడి నాయకులకు తను సీఎల్పీ రేసులో ఉన్నానని చెప్పారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి పని చేస్తానని వెల్లడించారు.
ఇక కెసిఆర్ తీరుపై ఫైర్ అయిన రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో వన్ మ్యాన్ షో నడుస్తుందని ఇప్పటివరకు కనీసం గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం కూడా చేయించలేదని నెల రోజులు కావస్తున్నా అన్ని తానే అన్నట్టుగా కెసిఆర్ ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. హరీష్ రావు ను కూడా పక్కనపెట్టి కెసిఆర్ అన్ని విషయాల్లో మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీలో ఉండి కెసిఆర్ ను ధీటుగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. అయితే సీఎల్పీ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని భావిస్తున్న రాజగోపాల్ రెడ్డికి అవకాశం తనకు లేదని ఆల్రెడీ సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలియదు కాబోలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article