జనసేనానికి జై కొట్టనున్న రాజమండ్రి ఎమ్మెల్యే

Rajahmundry Urban MLA Praises JanaSena  బీజేపీ కి షాక్ …

ఏపీలో బీజేపీకి షాక్ తగలనుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న బీజేపీ పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్న తరుణంలో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ప్రధాన పార్టీల వైపు చూస్తున్నారు. బిజెపి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా జరగదన్న భావనతో ఉన్న బిజెపి నేతలు పార్టీని వీడడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
ఇక తాజాగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆ విషయాన్ని ఖండించినప్పటికీ మొత్తానికి ఆయన పార్టీలో చేరడం మాత్రం ఖరారైంది. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ భార్య జనసేన పార్టీలో చేరి జనసేన లో కీలక భూమిక పోషిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే తాను అక్కడి నుండి పోటీ చేస్తానని ఆకుల సత్యనారాయణ ప్రకటించారు.2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ స్థానం నుండి ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల కాలంలోనే ఆయన భార్య జనసేనలో చేరారు. ఈ నెల 21న సత్యనారాయణ కూడ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఆయనకు రాజమండ్రి అర్బన్ నుండి టికెట్ ఇవ్వడానికి జనసేనాని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆకుల సత్యనారాయణ భార్యకు సైతం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆకుల సత్యనారాయణ జనసేనాని కి జై కొట్టడానికి ముహూర్తం ఖరారైంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article