రజినీ-కమల్ సినిమా?

41
rajani, kamal cinema
rajani, kamal cinema

rajani, kamal cinema

కొన్ని కాంబినేషన్స్  దేశం మొత్తాన్ని అలెర్ట్ చేస్తాయి. అలాంటిదే రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్. కానీ ఇందులో నిజమెంతా అనే డౌట్ అందర్లో ఉంది. కానీ అది నిజమే. కాకపోతే ఎప్పుడు నిజమవుతుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ఆ మేరకు బ్యాక్ ఎండ్ లో ఓ ప్రయత్నంతో పాటు వర్క్ కూడా జరుగుతోందనేది లేటెస్ట్ న్యూస్.యస్.. అన్నీ కుదిరితే ఈ కరోనా యేడాదిలోనే ఆ గ్రేటెస్ట్ కాంబినేషన్ గురించిన వార్త కూడా రావొచ్చు. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. కానీ అప్పట్లో రజినీకాంత్ ఎక్కువగా కమల్ కు విలన్ గానే నటించాడు. ఆ తర్వాత ఎవరికి వారు ఇమేజ్ లు తెచ్చుకున్నారు. బాషాకు ముందు వరకూ కోలీవుడ్ లో రజినీకంటే కమల్ దే పై చేయి. కానీ బాషా తర్వాత సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రజినీకాంత్. ఆ తర్వాత మళ్లీ కమల్ ఎప్పుడూ రజినీని బీట్ చేయలేకపోయాడు. ఇంకా చెబితే ఇప్పుడు కమల్ కు రజినీ రేంజ్ కూడా లేదనేది వాస్తవం. బట్.. క్రేజ్ విషయంలో ఇద్దరూ సమానమే. రజినీ మాస్ ను మెప్పిస్తే.. కమల్ క్లాస్ లో తిరుగులేని స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఓ సినిమా చేయాలని చాలామంది చాలాకాలంగా చాలా ప్రయత్నాలే చేశారు. బట్ ఏవీ వర్కవుట్ కాలేదు.

అయితే ఇన్నాళ్లకు ఓ కొత్త దర్శకుడు ఆ బాధ్యత భుజానికెత్తుకున్నాడు అంటున్నాడు. అతనెవరో కాదు.. లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం సౌత్ లో హాట్ కేక్ లాంటి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్. అందుకు కారణం .. కార్తీతో చేసిన ఖైదీ. ఈ మూవీతో అతను ఓవర్ నైట్ సౌత్ లో హాట్ ఫేవరెట్ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ తో చేసిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి మాస్టర్ కూడా ఓ బెస్ట్ మూవీ అవుతుందంటున్నారు. అయితే మాస్టర్ చేస్తోన్న టైమ్ లోనే లోకేష్ కు కమల్ ఆఫర్ ఇచ్చాడు. ఇటు రజినీకాంత్ సైతం అతనితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. దీంతో ఒకే సినిమాతో ఇద్దరు స్టార్స్ ను శాటిస్ ఫై చేయొచ్చనే ఐడియాతో అతను వర్క్ చేశాడు. అన్నీ కుదిరితే ఈ దర్శకుడితోనే కమల్ అండ్ రజినీ నటించే అవకాశం ఉంది. మరి ఇది నిజమైతే మాత్రం మూడు దశాబ్ధాలుగా ఎందరో దర్శకులకు సాధ్యం కాని పని లోకేష్ కనకరాజ్ చేసినట్టవుతుంది. మరోవైపు లోకేష్ కు తెలుగులో కూడా మైత్రీ మూవీస్ బ్యానర్ భారీ అడ్వాన్స్ ఇచ్చి ఉంది. ఈ బ్యానర్ లో మహేష్ బాబు లేదా రామ్ చరణ్ తో సినిమా ఉంటుందనేది విపరీతంగా వినిపిస్తోన్న వార్త. ఆ ఇద్దరూ లేదా మరో హీరో అయినా ముందు కమల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే అనేది నిజం.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here