రజినీకాంత్ 2.0 తో ఆస్ట్రేలియా పోలీసుల ట్వీట్ వైరల్

Rajanikant 2.0 Australian twitter viral

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. o సినిమాలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి ఒక కేసుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ 2. o సినిమాలోని ఓ ఫోటోను పోస్ట్ చేసి ఆ కేసును రజినీ సినిమాలోని డైలాగ్ తో పోల్చి ట్వీట్ చేశారు ఆస్ట్రేలియాలోని డెర్బె పోలీసులు. రజినీకి ఇతర దేశాల్లో ఉన్న క్రేజ్ కు రజనీ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నారు. నెట్టింట్లో ఈ పోస్టు ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది.

తలైవా ,సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తలైవా రజినీకాంత్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, జపాన్ దేశాల్లో సైతం అభిమానులు ఆయనను ఫాలో అవుతున్నారు. అయితే, రజినీకాంత్ కున్నఈ పాపులారిటీని ఆస్ట్రేలియన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో వాడుకుని రజనీ కి ఆస్ట్రేలియాలో ఉన్న క్రేజ్ తెలియజేశారు.డ్రంక్ డ్రైవ్ కు సంబంధించిన ఓ ట్వీట్‌లో రజినీకాంత్ నటించిన 2.O సినిమాలోని ఓ సన్నివేశం ఫొటోను పోస్ట్ చేశారు ఆస్ట్రేలియన్ పోలీసులు .
తాజాగా డ్రంక్ డ్రైవర్‌కు సంబంధించిన ఓ ట్వీట్‌లో ఆస్ట్రేలియన్ పోలీసులు రజనీకాంత్ నటించిన 2.O సినిమాలోని ఓ సన్నివేశం ఫొటోను పోస్ట్ చెయ్యటం ఆసక్తిని రేకెత్తించింది. డెర్బే పోలీసులు చేసిన ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ‘2.O’ సినిమాలో రజినీకాంత్ 5వ ఫోర్స్ గురించి వివరిస్తారు. అయితే మద్యం తాగిన వ్యక్తి లో కనుగొన్న ఆల్కహాల్ స్థాయిని ‘2.O’ సినిమాలోని 5వ శక్తి, (ఫిఫ్త్ ఫోర్స్) తో పోలుస్తూ , ‘2.O’ సినిమాలో రజినీ ఫోటోతో పాటు పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న డెర్బే పోలీసులు పోస్ట్ చేసిన ఈ ఫొటో వద్ద.. మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వివరాలను ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిన వ్యక్తి శ్వాస పరీక్షలో బ్లడ్ ఆల్కహాల్ స్థాయి 0.341 శాతం ఉందని కనుగొన్నారు. ఇది కోమాలో ఉండే రోగికి ఉండేంత మత్తు లేదా, సర్జరీ సమయంలో వైద్యులు ఇచ్చే మత్తుతో సమానమని ఈ పోస్టులో పేర్కొన్నారు. అది జీవశాస్త్రపరంగా కూడా సాధ్యం కాదని తెలిపారు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్ట్రేలియాలో కూడా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article