Rajanikant Not participating in Elections
ఎన్నికల్లో పోటీపై తలైవా రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తాను గానీ, తమ పార్టీగాని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. తాను ఏ పార్టీకి మద్దతివ్వబోమని తెలిపారు. ఈమేరకు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే తమ ఉద్దేశమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై రజనీకాంత్ ఆదివారం నాడు స్పష్టత ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగానే తమ పార్టీ పోటీ చేస్తోందని రజనీకాంత్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీకి కూడ మద్దతును ఇవ్వదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ, అభ్యర్థులు కూడ తన ఫోటోలను, గుర్తులను వాడుకోకూడదని ఆయన కోరారు. ప్రజల సమస్యల్ని తీర్చడంలో ముందుండేవారిని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారిని ఎన్నుకోవాలని రజనీకాంత్ సూచించారు.ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.
For More Click Here