తెలుగులోకి ర‌జ‌నీకాంత్ విల‌న్‌?

Rajanikant Vilan entry to Telugu
ర‌జ‌నీకాంత్ `2.0`లో ధీనేంద్ర బోరా పాత్ర‌లో న‌టించిన సుధాంశు పాండే ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోకి విల‌న్‌గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్, రామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంలో ఈ బాలీవుడ్ న‌టుడు విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ట‌. ఈయ‌న‌కు సంబంధించిన పార్ట్‌ను మార్చిలో చిత్రీక‌రించేలా పూరి జ‌గ‌న్నాథ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.  ఈ సినిమా కోసం సుధాంశ్ గెడ్డం లుక్‌తో క‌న‌ప‌డ‌బోతున్నాడు. పూరి సినిమాల్లో విలన్స్‌ను బాగానే ప్ర‌జెంట్ చేస్తాడు. మ‌రి ఈ చిత్రంలో సుధాంశ్ పాండేను ఎంత డిఫ‌రెంట్‌గా ప్రెజెంట్ చేస్తాడ‌నేది చూడాలి. ఈ సినిమాను మే నెల‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు పూరి, ఛార్మి. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article