Rajanikanth Target is 2021
సూపర్‌స్టార్ రాజకీయ రంగ ప్రవేశం ఇక అధికారికం కావాల్సి ఉంది. ఆయనేమో సినిమాలతో బిజి బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన విషయాన్ని చెప్పేశారు. తమ టార్గెట్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తప్ప రానున్న లోక్‌సభ ఎన్నికలు కావని ఉత్కంఠతకు తెరదించారు. అలాగే తాము ఏ పార్టీకి మద్ధతు ఇవ్వమని, లోక్‌సభ ఎన్నికల్లో తన ఫోటోను కానీ.. గుర్తును కానీ ఉపయోగించరాదని.. నిబంధనలు మీరి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన సూచించారు. అంతే కాకుండా తమిళనాడులోని నీటి సమస్యను తీర్చేవారికే ప్రజలు ఓటు వేయాలని సూచించారు కూడా.
For More Click Here