నీలకంఠ కథను కాదన్న రాజశేఖర్ ..

37
rajasekhar movie update
rajasekhar movie update
rajasekhar movie update

ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా మళయాల సినిమాలపై విపరీతంగా మోజుపడ్డారు మనవాళ్లు. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియమ్, కప్పెలా, లూసీఫర్ వంటి సినిమాలు లైన్ లో ఉండగా లేటెస్ట్ గా మరో క్రేజీ మూవీ తెలుగులోకి రీమేక్ కాబోతోంది. అదే జోసెఫ్. జోసెఫ్ 2018లో వచ్చిన సినిమా. క్రైమ్ థ్రిల్లర్. రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్స్ కు భిన్నంగా కాస్త ‘రా’గా సాగే కథనం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రధాన పాత్రలో నటించిన జీజూ జార్జ్ ఈ మూవీతో మళయాలంలో సెటిల్ అయిపోయాడు. ఈ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హీరో రాజశేఖర్. యస్.. కొన్నాళ్ల క్రితమే అల్లు అరవింద్ ఈ మూవీ రీమేక్ రైట్స్ ను తీసుకున్నాడు. కొన్ని రోజులుగా ఈ బ్యానర్ లో రాజశేఖర్ హీరోగా నటిస్తాడు అనే వార్తలు వచ్చాయి. ఫైనల్ గా అదే నిజం అయింది.  జోసెఫ్ రీమేక్ ను తెలుగులో డైరెక్ట్ చేయబోతున్నది నీలకంఠ. ఈ మధ్యే ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి అఫీషియల్ వార్త వచ్చింది. అయితే మొదట్లో నీలకంఠ తను సొంతంగా రాసుకున్న కథతో రాజశేఖర్ ను అప్రోచ్ అయ్యాడు. అది అతనికి బాగా నచ్చింది. కానీ ఈ కథపై మోజు ఉంది.

పైగా ఈ కథకు రాజశేఖర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని అంతా అనుకుంటున్నారు కూడా. నిర్మాతగా ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ రాజీపడని అల్లు అరవింద్ సైతం రాజశేఖర్ తోనే ఈ సినిమా చేసేందుకు ముందుకు రావడంతో నీలకంఠ సొంత కథ ప్రస్తుతానికి సైడ్ అయిపోయింది. రాజశేఖర్ నీలకంఠల సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇందులో హీరోయిన్ లాంటి రెగ్యులర్ పాత్ర ఉండదు కానీ.. ఫిమేల్ లీడ్ లో వేదికను తీసుకున్నారని సమాచారం. మరో విశేషం ఏంటంటే.. జోసెఫ్ చిత్రాన్ని కన్నడలో కూడా రాజశేఖర్ ఏజ్ గ్రూప్ కు చెందిన రవిచంద్రన్ రీమేక్ చేస్తున్నాడు. దర్శకుడు కూడా అతనే. మొత్తంగా రాజశేఖర్ కు ఈ పాత్ర టైలర్ మేడ్ లాంటిదని చెప్పొచ్చు. మరి కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే మాత్రం అతనికి ఇది మరో గరుడవేగ లాంటి విజయాన్నిస్తుందనడంలో డౌటే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here