#Rajastan royals beats the kings punjab#
ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు పూర్తికావోస్తుండటంతో ఒక్కొజట్టు గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టేందుకు ఊవిళ్లు ఊరుతున్నాయి. ఇప్పటికే ముంబై టాప్ గేర్ వేసి ప్లే ఆఫ్ కు చేరుకోగా, రాజస్తాన్ రాయల్స్ ఆశలు నిలుపుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్టోక్స్ గెలుపునకు పునాది వేశారు. సంజూ సామ్సన్, స్మిత్, బట్లర్ జట్టును గమ్యానికి చేర్చారు.
దీంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. కీలక సమయంలో బౌలర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి పాలై తమ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని ముంచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో రాయల్స్ జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది.