కమల్ తో అంటే రజినీకి ఫిక్స్ అయ్యాడా

Rajini’s next with Lokesh Kanagaraj

ఒక్క బాలీవుడ్ లో తప్ప సౌత్ లో ఇప్పుడు యువతరం దర్శకులు కొత్తతరహా కథలతో ఆకట్టుకుంటున్నారు. వారి వైవిధ్యానికి నిన్నటి తరం స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతున్నారు. మామూలుగా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఇంతకుముందు మళయాలం, తమిళంలో కనపించేవి. అక్కడ ఇప్పుడు ఇంకా పెరిగాయి. ఇటు తెలుగులోనూ పెరిగాయి. అందుకే అలాంటి వైవిధ్యం ఉన్న సినిమాలు ఏ భాషలో వచ్చినా మరో భాషా ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. విజయం కట్టబెడుతున్నారు. అలా గతేడాది వచ్చిన తమిళ్ సినిమా ‘ఖైదీ’ఎంటైర్ సౌత్ ను ఫిదా చేసింది. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతనికి ఇది రెండో సినిమానే కావడం విశేషం. అయినా ప్రతిభకు కొలమానం లెక్కల్లో ఉండదు కదా. అందుకే మూడో సినిమాకే కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘మాస్టర్’అనే సినిమా రూపొందుతోంది.

అయితే మాస్టర్ కంటే ముందే లోకేష్ కు కమల్ హాసన్ ఆఫర్ ఇచ్చాడు. కమల్ కోసమే ప్రత్యేకంగా కథ సిద్ధం చేసుకున్నాడు లోకేష్. కానీ ఇప్పుడు కమల్ భారతీయుడు -2తోబిజీగా ఉన్నాడు. పైగా ఇది అనుకున్న టైమ్ లో పూర్తయ్యేలా లేదు. దీంతో మాస్టర్ తర్వాత అతను రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నాడు. రజినీ ఇప్పుడు అజిత్ దర్శకుడు శివతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. ఆ సినిమా పూర్తయ్యేలోగానే మాస్టర్ విడుదల కూడా అవుతుంది. దీంతో ఈ యేడాది చివరి వరకూ రజినీకాంత్, లోకేష్ ల కాంబినేషన్ లో సినిమా పూర్తవుతుందట. అన్నీ కుదిరితే ఈ మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో నిలుస్తాడు సూపర్ స్టార్.

Rajini’s next with Lokesh Kanagaraj,Not Kamal Haasan,Lokesh Kanagaraj,Kaithi Fame Lokesh Kanagaraj,Vijay With Lokesh In 64 Film,Tollywood Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *