రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల పిర్యాదు

Sensational:Rajkumar Hirani Ac used for Sexual Harassment 
మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా ఇటీవ‌ల మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రిగింది. ఇండియ‌న్ సినిమాల్లో చాలా మందిపై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్పుడిప్పుడే ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణుగుతుంద‌నుకుంటున్న త‌రుణంలో బాంబ్‌లాంటి వార్త సంచ‌ల‌నానికి కేంద్ర బిందువైంది. మున్నాభాయి ఎం.బి.బి.ఎస్‌, మున్నాభాయి గాంధీగిరి, పీకే, సంజు వంటి సెన్సేష‌న‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీపై సంజు సినిమాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన స‌హాయ‌క ద‌ర్శ‌కురాలు ఆ చిత్ర నిర్మాత విదు వినోద్ చోప్రా, ఆయ‌న భార్య , సోద‌రికి మెయిల్ పెట్టిన‌ట్లు.. అందులో ఆరునెలలుగా రాజ్‌కుమార్ హిరాణీ త‌న‌పై లైంగిక అత్యాచారం చేస్తున్నాడ‌ని, ఉద్యోగం వ‌దులుకోలేక‌, త‌ను చేసే ప‌ని గురించి బ‌య‌ట త‌ప్పుగా మాట్లాడుతార‌నే భ‌యంతో ఆమె ఎవ‌రికీ చెప్పుకోలేక‌పోతున్నాన‌ని పేర్కొన్న‌ట్లు ఈస్ట్ పోస్ట్ ప‌త్రిక పేర్కొంది. అయితే హిరాణీ లాయ‌ర్ మాత్రం ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని, ఆయ‌న పేరు చెడ‌గొట్ట‌డానికే ఎవ‌రో ఇదంతా చేయిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనుందో చూడాలి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article