లోక్ సభకు పోటీ చేయడంలేదు

RAJNI NOT TO CONTEST LS

  • 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం
  • సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడి

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు తెలపడంలేదని పేర్కొన్నారు. తమ లక్ష్యం 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టంచేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. కాగా, రజనీ తాజా ప్రకటనతో ఆయన అభిమాన వర్గాల్లో నిరాశ నెలకొంది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article