Rajnikanth New Film with Keerthi Suresh
ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ త్వరలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ జతగా సినిమా చేయనుందని వార్తలు వినపడుతున్నాయి. పేట తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రజనీకాంత్ త్వరలోనే ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా యూనిట్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ అయితే బావుంటుందని భావిస్తున్నారట. మురుగదాస్ గత చిత్రం సర్కార్‌లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తనైతే బావుంటుందని మురుగదాస్ కూడా భావిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.