Then Runner Now Boxer
`భాగ్ మిల్కా భాగ్` బయోపిక్‌ను తెరకెక్కించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్ర మరోసారి ఫర్హాన్ అక్తర్‌తో మరోసారి జత కట్టనున్నాడు. ఆరేళ్ల తర్వాత అంటే.. 2013లో భాగ్ మిల్కా భాగ్ విడుదలై ఘన విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ ఓ బాక్సర్ జర్నీ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఆధారంగా సినిమా చేయబోతున్నారట. అయితే ఇది ఎవరిదైనా బాక్సర్ జీవిత కథా? లేదా అనేది తెలియడం లేదు. ఈ చిత్రానికి `తుఫాన్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం రానుంది.