రాకేష్ రెడ్డి తో పోలీసులకు లింకులు

Rakesh Reddy Connection with Police …రియల్ దందాలో భారీగానే ముట్టిన ముడుపులు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పోలీసుల పాత్రపై బహిర్గతమవుతున్న అంశాలు పోలీస్ శాఖకు తలనొప్పిగా తయారయ్యాయి. రాకేష్ రెడ్డి కి పోలీసులతో ఉన్న సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. క్రిమినల్స్ తో పోలీసులకు లింకులున్నాయన్న విషయం జయరాం హత్యతో వెలుగులోకి వచ్చింది. ఒక చిగురుపాటి జయరాం హత్య లోనే కాకుండా, పలు సందర్భాల్లో, పలు కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇక తాజాగా జరిగిన ఈ మర్డర్ మిస్టరీ లో ఏకంగా పదకొండు మంది పోలీసులతో రాకేష్ రెడ్డి హత్య తర్వాత మాట్లాడారని దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురి చేస్తోంది. పోలీసుల పైన నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది.
ఈ హత్యోదంతంలో పోలీసుల పాత్ర పై పోలీస్ బాస్ లు సీరియస్ గా ఉన్నారు. రాకేష్ రెడ్డి తో పోలీసులకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. రాకేష్ రెడ్డి తో కలిసి పోలీసులు రియల్ ఎస్టేట్ దందా చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నారు పోలీస్ బాస్ లు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో ఫోన్‌లో సంభాషించిన పోలీస్‌ అధికారుల పాత్రపై నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రాకేశ్ మొబైల్ కాల్ డేటా ఆధారంగా అతడితో మాట్లాడిన వారి వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. జయరాం హత్యకు సలహాలిచ్చారా? హత్యచేసిన తర్వాత మాత్రమే సాయం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రాకేష్ రెడ్డి తో సంబంధం ఉన్న పోలీసుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఇదే కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఎస్ఐ శ్రీనివాసులుపై బదిలీ వేటు పడింది. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు సహా మరో ఇద్దరు అధికారులకు రాకేశ్‌తో సంబంధాలున్నాయని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. రాయదుర్గం ఎస్ఐ రాంబాబుపై బదిలీ వేటు పడింది. ఆయనను సాయుధ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఐదుగురిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మొత్తం 11 మంది పోలీసులతో రాకేష్ రెడ్డి కి సంబంధాలు ఉన్న నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాకేష్ రెడ్డి తో కలిసి పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్ లకు పాల్పడే పాల్పడేవారిని విచారణలో తేలింది. హైదరాబాద్ శివార్లలో ల్యాండ్ సెటిల్మెంట్ లు చేస్తూ పోలీసులకు భారీగా నజరానాలు ముట్ట చెప్పేవాడిని ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి.
గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగినట్టు పోలీసులు కనుగొన్నారు. ఖాళీ స్థలాలపై వివాదాలు సృష్టించి పోలీసులతో బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ దందా పేరుతో పలువురు వ్యాపారులకు రాకేష్‌ రెడ్డి టోకరా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాగా డబ్బులున్న వ్యాపారులను పోలీసులతో కలిసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్న పోలీసులపై విచారణ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. దీంతో పోలీసు శాఖలో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article