కోహ్లీ , రోహిత్ పై రాఖీ సావంత్ ఫైర్

RAKHI SAWANT FIRES ON KOHLI & ROHITH

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో 120 కోట్ల మంది భారతీయుల కలలను చిదిమేస్తూ టీమిండియా న్యూజిలాండ్ పై సెమీ ఫైనల్లో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు ఒక ఇంగ్లాండ్ తో మ్యాచ్ మినహాయించి తిరుగులేని విజయాలను సాధించిన జట్టు ఫైనల్ కు ముందు మ్యాచ్ లో మాత్రం బోల్తాపడింది. టీమిండియా ఓటమిపై దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల నుంచి… సామాన్యుల వరకు మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.ఇదే టైం లో టీం ఇండియాలో ఉన్నగ్రూపులు కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయి అని ఒక గ్రూపునకు కెపెక్టన్ విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తుంటే… మరో గ్రూపునకు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వం వహిస్తున్నాడని కూడా జాతీయ మీడియాలో సంచలన కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ హాట్ నటి రాఖీ సావంత్ టీం ఇండియా ఓటమి పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

SPORTS NEWS

కెప్టెన్ కోహ్లీతో పాటు – వైస్ కెప్టెన్ రోహిత్ ఇంగ్లండ్ టూర్ ను ప్రపంచకప్ టూర్ గా భావించకుండా… తమ ఫ్యామిలీ హనీమూన్ టూర్ లా ఎంజాయ్ చేశారని… అందుకే వీరు తమ భార్యలను – గాళ్ ఫ్రెండ్స్ ను ఇంగ్లండ్ తీసుకెళ్లారని విమర్శించింది. అనుష్క వల్ల కోహ్లీ – రితిక సజ్దే వల్ల రోహిత్ శర్మ ఏకాగ్రత దెబ్బ తినడంతోనే భారత్ సెమీస్ లో ఓడిపోయిందని తీవ్రంగా విమర్శించింది. ఇక అనుష్క – రితిక ఇద్దరూ ఇండియా ఆడిన మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూస్తూ టోటల్ టీంకు సపోర్ట్ చేయడంతో పాటు తమ భర్తలు ఆడుతున్నప్పుడు కూడా బాగా ప్రోత్సహించారు. రోహిత్ ఐదు సెంచరీలతో ఈ ప్రపంచకప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తే… కోహ్లీ కూడా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో పాటు శ్రీలంకతో మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీకి దగ్గరకు వచ్చాడు. కర్ణుడు చావుకు అనేక కారణాలు అన్నట్టు టీం ఇండియా ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే రాఖీ అవన్నీ వదిలేసి వీళ్ల భార్యలకు లింక్ పెట్టి చేసిన వ్యాఖ్యలు మాత్రం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

RAKHI SAWANT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *