ఆ కామెంట్ తో అడ్డంగా బుక్ అయిన రకుల్ ప్రీత్ సింగ్

Raku Preet Sing Caught in America

సోషల్‌ మీడియా ఇప్పుడు సొసైటీ ని డామినేట్ చేస్తుంది.. సమాజంలో ఎలా ఉన్నా, ఏం మాట్లాడుకున్నా ఎవ్వడూ పట్టించుకోరు. కానీ సోషల్‌ మీడియాలో జాగ్రత్తగా లేకపోతే.. ఒక్క క్షణంలో పరువు పోవడం ఖాయం. ప్రస్తుతం అలా నోరుజారి అడ్డంగా బుక్కైంది బక్కపల్చని భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.
ఈ మధ్య ఒక ఔత్సాహికుడు రకుల్ ప్రీత్ సింగ్ కారు నుండి దిగుతున్న హాట్ ఫోటోలు తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసి అసభ్యకరమైన కామెంట్ చేయడంతో రకుల్ ఆ వ్యక్తి కి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సమానత్వం, రక్షణ అంటూ చర్చలు జరపటం వల్ల ఉపయోగం లేదంటూ కామెంట్ చేసింది రకుల్‌.
ఇండస్ట్రీలో గ్లామర్‌గా కన్పిస్తేనే అవకాశాలు. దీన్ని కనిపెట్టిన రకుల్‌.. తన హాట్‌ ఫోటోల్ని అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అలా.. రీసెంట్‌గా కారు దిగుతూ మాంచి హాట్‌గా ఉన్న ఒక ఫోటోని పోస్ట్‌ చేసింది రకుల్‌. అది చూసిన ఒక ఔత్సాహికుడు.. “పని అయ్యింది. ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయింది” అనే అర్థం వచ్చేలా కామెంట్‌ పెట్టాడు. ఇది చూసి రకుల్ ప్రీత్‌ సింగ్‌కు మండింది . వెంటనే.. “ఇలాగే మీ అమ్మ కూడా చేసి ఉంటుంది” అంటూ చాలా ఘాటుగా రెస్పాండ్‌ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు రకుల్‌పై విరుచుకు పడుతున్నారు. తప్పు చేసింది అతనైతే.. మధ్యలో వాళ్ల అమ్మ ఏం చేసింది.? ఇదేనా నీ సంస్కారం. అంటూ ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. సంజాయిషీ ఇచ్చేందుకు రకుల్ ట్రై చేసినా కానీ నెటిజన్లు శాంతించలేదు. అంతేమరి.. సోషల్‌ మీడియాలో ఒక కామెంట్‌ పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇక సినీ తారలు అయితే మరింత జాగ్రత్తగా కామెంట్ చేయాలి. అతనెవరో తప్పుగా మాట్లాడారని ఆవేశంతో కామెంట్‌ పెడితే అదీ మరొక మహిళను అవమానించేలా కామెంట్ పెడితే రకుల్‌ ప్రతీత్‌ సింగ్‌లా అడ్డంగా బుక్‌ అవ్వక తప్పదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article