Ram Charan Is Different from Others
ప్లాప్ అయినా కూడా మా సినిమా హిట్ అనడం.. దాని గురించి మాట్లాడకపోవడం నేటి ట్రెండ్.. అయితే అందుకు తాను భిన్నంగా అని చెప్పిన రామ్‌చరణ్ `వినయవిధేయరామ` ప్లాప్ అయ్యిందని ఓపెన్‌గా ఒప్పుకుంటూ బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ఎందుకంటే సినిమా పోయిందని అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి.. “మా సినిమా కోసం రేయింబగళ్లు కష్టించి సహకారం అందించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మరువలేనది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు. మేం ఎంతగానో శ్రమించినా దురదృష్టవశాతు.. మీ అంంచనాలను అందుకోలేకపోయాం. మీ ప్రేరణ, అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు మెచ్చేసినిమాలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను“ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు రాంచరణ్.