చిరంజీవి తర్వాత చరణ్ తోనే ..

188
Ram Charan Next Movie With Koratala
Ram Charan Next Movie With Koratala

Ram Charan Next Movie With Koratala

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా కోసం చాలామంది ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ మూవీలో మొదట రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు అని చెప్పారు. కానీ చరణ్ ప్లేస్ లోకి మహేష్ బాబు వచ్చాడు. అయితే లేటెస్ట్ గా మహేష్ ను కూడా వద్దనుకున్నారనీ.. మళ్లీ చరణే నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా మేటర్ ఎలా ఉన్నా.. రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా ఖరారయ్యింది.

తొలి సినిమా నుంచే టాలీవుడ్ టాప్ హీరోలు, టాప్ ప్రొడక్షన్ హౌసెస్ తోనే సినిమాలు చేస్తోన్న కొరటాల శివతోనే రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుందట. ఈ విషయంపై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఎవరూ ఖండించలేదు. ఖరారూ చేయలేదు. కాకపోతే తాజాగా చిరంజీవి సినిమా విషయంలో జరిగిన అంశాలను బట్టి చూస్తే కొరటాల శివ.. ఆల్రెడీ చరణ్ కోసం రాసుకున్న కథతోనే ఈ సినిమా ఉండబోతోంది అంటున్నారు.

మామూలుగా కొరటాల సినిమా అంటే కాస్త సామాజిక కోణం కూడా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్ దేశభక్తిని రంగరించుకున్న కథ. కాబట్టి.. ఆ వెంటనే కొరటాలతో సినిమా చేస్తే ఖచ్చితంగా రేంజ్ మరింత మారుతుంది. అలాగే మెసేజ్ ఓరియంటెడ్ కథల్లో ఇప్పటి వరకూ రామ్ చరణ్ నటించలేదు. ఆ లోటూ తీరుతుంది. మొత్తంగా ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా పూర్తి కాగానే శివ మళ్లీ మెగా క్యాంప్ లోనే మరో మూవీ చేయబోతున్నాడు అనుకోవచ్చు. సో.. రామ్ చరణ్ కు ఇప్పుడు మెగా సినిమాలో ఛాన్స్ మిస్ అయినా కొరటాలతో మాత్రం మిస్ అవడం లేదన్నమాట

Ram Charan Next Movie With Koratala,Mahesh Babu,Chiranjeevi,Koratala Shiva,Ramcharan,Koratala Next Movie With Ramcharan,Tollywood Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here