ఇద్ద‌రు హీరోయిన్స్‌తో రామ్‌

Ram Is Romancing with two heroins

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్‌` రీసెంట్‌గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. `డబుల్ ధమాకా దిమాక్ ‘ అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా ఈ లాంగ్ షెడ్యూల్ లో హీరో రామ్ పై పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. ఇటీవ‌ల అను ఇమ్మాన్యుయేల్ పేరుప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది కూడా. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తార‌ని అందులో భాగంగా తాజాగా నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్‌ల‌ను హీరోయిన్స్‌గా ఎంపిక తీసుకోవాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article