Thursday, December 26, 2024

“రామ్ నగర్ బన్నీ”  ప్రీ రిలీజ్ 

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఫైట్ మాస్టర్ రాము మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాలో చంద్రహాస్ మంచి యాక్షన్ సీక్వెన్సులు చేశాడు. అతనిలో నేర్చుకోవాలనే తపన ఉంది. ఏదైనా స్టంట్ సరిగ్గా రాకుంటే నా వెంటపడి మరీ పర్పెక్ట్ గా వచ్చేవరకు ట్రై చేసేవాడు. చంద్రహాస్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. “రామ్ నగర్ బన్నీ” సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
లిరిక్ రైటర్ అవినాష్ మాట్లాడుతూ – ఓ రియాల్టీ షో సందర్భంగా ప్రభాకర్ గారిని కలిశాను. అప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ పరిచయంతో ఒకరోజు “రామ్ నగర్ బన్నీ” సినిమాకు పాట రాయమని అడిగారు. ఈ మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. సినిమా పెద్ద హిట్ అయి, చంద్రహాస్ కు మంచి పేరు తేవాలి. అన్నారు.
లిరిక్ రైటర్ సాగర్ మాట్లాడుతూ – ముద్దుబిడ్డ సీరియల్ టైమ్ లో ప్రభాకర్ గారు చంద్రహాస్ ను, దివిజను భుజాలపై ఎత్తుకుని వచ్చేవారు. ఈ రోజు చంద్రహాస్ హీరోగా ఎదగడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో మంచి సాంగ్స్ రాసే అవకాశం కలిగినందుకు హ్యాపీగా ఉంది. అన్నారు
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నట్లు టీజర్, ట్రైలర్ తో తెలుస్తోంది. చంద్రహాస్ ప్రామిసింగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా చంద్రహాస్ తో పాటు ప్రభాకర్ కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా ట్రైలర్ సాంగ్స్ బాగున్నాయి. చంద్రహాస్ ప్రామిసింగ్ గా ఉన్నాడు. ప్రభాకర్ కంటే చంద్రహాస్ ఇంకా ఎక్కువ గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటుడు సలీమ్ ఫేకు మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాలో నేను గౌలిగూడ గణేష్ క్యారెక్టర్ లో నటించాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు చంద్రహాస్ ను అబ్సర్వ్ చేశాను. అతను ఫైట్స్, డ్యాన్సులతో మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. “రామ్ నగర్ బన్నీ”  కేవలం ఎంటర్ టైనింగ్ మూవీ మాత్రమే కాదు ఇందులో కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. అక్టోబర్  4న థియేటర్స్ లో చూడండి. అన్నారు.
నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ – ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్. మనకు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. చంద్రహాస్ అలా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. “రామ్ నగర్ బన్నీ”  సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అన్నారు.
సంగీత దర్శకుడు అశ్విన్ హేమంత్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” మూవీకి మంచి సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. పాటలకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉంది. చంద్రహాస్ ఈ చిత్రంలో వాట్ ఈజ్ ది రాంగ్ అనే పాట పాడాడు. ఈ పాట ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. “రామ్ నగర్ బన్నీ” సినిమా థియేటర్స్ లోనూ ఇదే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ – ప్రభాకర్ నాకు పాతికేళ్లుగా మిత్రుడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. చంద్రహాస్ చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తుంటే వీడిని ఆర్మీ స్కూల్ లో చదివించాలని ప్రభాకర్ మాతో అనేవాడు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు నీకు మీ నాన్న ఉన్నాడు. “రామ్ నగర్ బన్నీ” పాటలు, ట్రైలర్, మిగతా కంటెంట్ ఆకట్టుకునేలా ఉంది. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. చంద్రహాస్ కు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ రిచా జోషి మాట్లాడుతూ-  “రామ్ నగర్ బన్నీ” సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. చంద్రహాస్ మంచి కోస్టార్. అతనితో నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అక్టోబర్ 4వ తేదీ డేట్ గుర్తుంది కదా మీరంతా తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడండి. అన్నారు.
హీరోయిన్ రీతు మంత్ర మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మళయజ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో మీ అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. హీరోయిన్ గా నాకు రామ్ నగర్ బన్నీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా టీజర్, ట్రైలర్ ను మీరంతా ఇష్టపడ్డారు. ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆర్జీవీ గారికి, ఇతర గెస్టులకు థ్యాంక్స్. మా మూవీకి మీ సపోర్ట్ మరింతగా ఇస్తారని కోరుకుంటున్నా. “రామ్ నగర్ బన్నీ” మూవీని థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ విస్మయ శ్రీ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాలో శైలు క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ ఈవెంట్ కు సపోర్ట్  చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు మంచి స్క్రిప్ట్ రాశారు. నాలో కొత్త విస్మయను తెరపై చూపించారు. చంద్రహాస్ నాకు మంచి ఫ్రెండ్. చంద్రహాస్ లో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన తన పేరెంట్స్ గర్వపడేలా ఎదగాలని కోరుకుంటున్నారు. అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఎంతకాలం అయినా దర్శకుడిగా ఆయన వేసిన ముద్ర అలాగే ఉంటుంది. “రామ్ నగర్ బన్నీ” సినిమాకు మా టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. మాకంటే మా ప్రభాకర్ రెట్టింపు కష్టపడ్డాడు. చంద్రహాస్ ఇది నా సినిమా అనుకుని అన్నింటిలో ది బెస్ట్ ఇచ్చాడు. డ్యాన్స్, ఫైట్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. దివిజ లాంటి సోదరి ఉండటం చంద్రహాస్ అదృష్టం. ఈ పిల్లలు చాలా టాలెంటెడ్ కిడ్స్. మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చిన అశ్విన్ కు థ్యాంక్స్. అలాగే కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరూ ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. “రామ్ నగర్ బన్నీ” సినిమాను అక్టోబర్ 4వ తేదీన థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ మూవీ బాగా నచ్చుతుంది. అన్నారు.
మూవీ ప్రెజెంటర్ దివిజ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మా అన్నయ్య చంద్రహాస్ ఒక పవర్ హౌజ్. అన్నయ్య టాలెంట్ చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. మా అమ్మా నాన్న ది బెస్ట్ పేరెంట్స్. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. “రామ్ నగర్ బన్నీ”  సినిమాకు సంబంధించిన ఏ కంటెంట్ చూపించినా ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ గురించే అడిగారు. అష్కర్ గారు అంత మంచి విజువల్స్ ఇచ్చారు. నలుగురు హీరోయిన్స్ స్క్రీన్ మీద చేసే సందడి అక్టోబర్ 4న థియేటర్ లో చూడండి. అన్నయ్య చంద్రహాస్ కు “రామ్ నగర్ బన్నీ”  మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లా అనిపిస్తోంది. మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్ చెబుతున్నాం. వాళ్లు మా సినిమాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్నారు. ప్రతి పేరెంట్ మా “రామ్ నగర్ బన్నీ” సినిమా చూడాలి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. సినిమా చూశాక మీరే మరో పదిమందికి మూవీ బాగుందని చెబుతారు. సినిమా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ గా మరిన్ని మూవీస్ చేసే శక్తి లభిస్తుంది. అలాంటి ఆదరణ మీ దగ్గర నుంచి దక్కుతుందని ఆశిస్తున్నాం. “రామ్ నగర్ బన్నీ” మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లో చూడండి. అన్నారు.
నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు ఎంతోమంది మిత్రుల సపోర్ట్ లభించింది. లోకేశ్వర్ రెడ్డి, మల్కాపురం శివన్న నాకు సపోర్ట్ చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఆర్జీవీ మా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. దామోదర ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు హెల్ప్ చేశారు. ఇలా ఎంతోమంది మా మూవీ ఇలా గ్రాండ్ గా మీ ముందుకు వచ్చేందుకు సహకరించారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఒక చిన్న సినిమా ప్రీ రిలీజ్ జరుపుకోవాలంటే చాలామంది చేయూత ఇవ్వాలి. “రామ్ నగర్ బన్నీ”  సినిమాను రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, నవీన్, రవి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మ మూవీ అక్టోబర్ 4న మీ ముందుకు వస్తోంది. నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెల్లు మా “రామ్ నగర్ బన్నీ” సినిమా చూసి మీ ఆదరణ అందిస్తారని కోరుకుంటున్నా. ప్రేక్షకులు మా సినిమా చూస్తే చాలు. చూసి ఎలా ఉందో చెప్పండి. కానీ మీరంతా థియేటర్స్ కు రావాలనేది మా టీమ్ కోరిక. అన్నారు.
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్. నాకు హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాన్న ప్రభాకర్ గారు ఇందాక చెప్పినట్లు ఆయనకు ఎంతమంది సపోర్ట్ చేశారో, అవసరం పడితే నేనూ వాళ్లందరి కోసం పరుగులు పెడుతూ వెళ్తాను. ఈ సందర్భంగా మూడు ప్రామిస్ లు చేస్తున్నా. నేను మాట ఇస్తే తప్పను. నా “రామ్ నగర్ బన్నీ”  సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తా. సినిమా చూసి ఆటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్ కు నేను అర్హుడిని కాదంటే నా నెక్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. అలాగే మీరు మా “రామ్ నగర్ బన్నీ”  సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు కంపల్సరీ గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపింతే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా.  మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా. “రామ్ నగర్ బన్నీ”  సినిమాను నేనంటే నచ్చేవాళ్లతో పాటు నచ్చనివాళ్లు కూడా చూడండి. మీరు నాలో నెగిటివ్ చెబితే నెక్ట్ మూవీకి మార్చుకుంటా. నా ప్రతి మూవీకి నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. గత రెండేళ్లలో నా గురించి ఎంతో నెగిటివ్ గా చెప్పారు. నేను అవన్నీ పాజిటివ్ గా తీసుకున్నా. నన్ను విమర్శిస్తే బాధపడను. ఈ జర్నీలో మీడియా మిత్రులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్లందరికీ థ్యాంక్స్. మా మూవీకి సపోర్ట్ చేసిన అందరికీ నాన్న థ్యాంక్స్ చెప్పారు. నాన్న చెబితే నేను చెప్పినట్లే. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూసి మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com