రామ చక్కని సీత ఫస్ట్ లుక్..

182
ramachakkani seetha first look
ramachakkani seetha first look
ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా శ్రీ హర్ష మండ తెరకెక్కిస్తున్న చిత్రం రామ చక్కని సీత. ఇంద్ర ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తన కథ కూడా నిజమే అంటున్నాడు దర్శకుడు శ్రీ హర్ష మండ. ఆయన తెరకెక్కిస్తున్న రామ చక్కని సీత షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. క్రొకోడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై విశాలక్ష్మి మండ, జి.ఎల్ ఫణికాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ప్రియదర్శి, కాశీ విశ్వనాథ్, అభయ్, బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ అప్పారావు, మధు మణి, రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా.. మురుగన్ గోపాల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు.
నటీనటులు
ఇంద్ర, సుకృత వాగ్లే, కాశీ విశ్వనాథ్, ప్రియదర్శి, అభయ్, బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ అప్పారావు, మధు మణి, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
రచన-దర్శకత్వం: శ్రీ హర్ష మండ
నిర్మాతలు:విశాలక్ష్మి మండ, జి.ఎల్ ఫణికాంత్
సంగీతం: కేశవ కిరణ్
సినిమాటోగ్రఫీ: మురుగన్ గోపాల్
ఎడిటర్: గారి బి హెచ్
ఆర్ట్: నాగేంద్ర
స్టంట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: సన్నీ
పి ఆర్ ఓ: వంశీ శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: నరేన్
లిరిక్స్: చైతన్య ప్రసాద్, సాగర్, శ్రీ హర్ష మండ
పబ్లిసిటీ డిజైనర్: ఓంకార్ కడియం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here