భక్తిశ్రద్దలతో రంజాన్

రంజాన్ పర్వదినాన్ని విశాఖ నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని పలు మసీదుల్లో ఈద్గా లలో ఉదయం నుండే పండగ సందడి నెలకొంది నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం షాబాన్ నెల చంద్రుడు సోమవారం కనిపించడం తో ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈదుల్ ఫితర్ పండుగ సందర్భంగా మసీదుల్లో ఈద్గా లలో ప్రత్యేక నమాజ్ ను ముస్లిం సోదరులు ఆచరించారు కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇళ్లలోనే పండుగ నమాజును జరుపుకున్న ముస్లింలు ఈ ఏడాది కరోనా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో మసీదులకు ఈద్గాలు కు తరలి వచ్చి పండుగ నమాజ్ ను జరుపుకున్నారు ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు పిల్లలు పెద్దలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు నగరంలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article