చరణ్ సినిమా ఆ దర్శకుడితో సెట్ అయినట్టే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆ ప్రభావం నుంచి ఎన్టీఆర్ తొందరగా బయటపడలేకపోయాడు. అందుకు దీటైన సినిమా చేయాలనే ఆలోచనతో ఆయన వేచి చూడాల్సి వచ్చింది. చాలా కథలు విన్నాక కొరటాల శివ చెప్పిన పాయింటే మేలనుకున్నారు. పాయింట్ ఓకే కానీ, పూర్తిస్థాయిలో స్క్రిప్ట్
లేదు. అయినా సరే, పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యేవరకు అంటే యేడాదిపైనే విరామం తీసుకుని మరీ ఆ సినిమా సెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మార్చిలో రెగ్యులర్ చిత్రీకరణ షురూ కావొచ్చు.
`ఆర్.ఆర్.ఆర్`లోనే నటించిన మరో కథానాయకుడు రామ్‌చరణ్ మాత్రం ఆ సినిమా ప్రభావం నుంచి త్వరగానే బయటపడిపోయాడు. అప్పటికే ఒప్పుకున్న శంకర్ సినిమా కోసం రంగంలోకి దిగడం, దాంతోపాటు ఎన్టీఆర్ వద్దనుకన్న బుచ్చిబాబు స్క్రిప్ట్‌కి ఓకే చెప్పడం ఇలా చకచకా జరిగిపోయాయి. శంకర్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ, అది పూర్తయిన వెంటనే మరో సినిమా చేయడానికి మాత్రం చరణ్ రెడీగా ఉన్నాడు.ఇప్పుడు మరో కథకి కూడా ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ఎప్పట్నుంచో వినిపిస్తూన్న కబురే ఇది. కన్నడ దర్శకుడు నర్తన్… యు.వి.క్రియేషన్స్‌తో కలిసి రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలని కథని సిద్ధం చేశాడు. ఆ కథకి ఓకే చెప్పిన చరణ్, పూర్తిస్థాయి స్క్రిప్ట్‌తో రమ్మన్నాడట. ఇటీవలే ఆ స్క్రిప్ట్‌ని విన్న చరణ్ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. అంటే పవన్ కోసం రెండు కథలు ఎదురు చూస్తున్నాయన్నమాట.శంకర్ వదిలిపెట్టడమే ఆలస్యం… చరణ్ మిగతా సినిమాల్ని మెరుపు వేగంతో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.