హైదరాబాద్ :నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు…
నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్డీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
రాజా సింగ్ ఫైర్
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్… ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని ఉద్దేశిస్తూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది… బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు ఆర్జీవీని టార్గెట్ చేశాయి.. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి.. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఇక, వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటాడు అని దుయ్యబట్టిన ఆయన.. ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్ ను ఖండించారు.. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్.ఇక, వివాదాలతో తరచూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ నేతలు.. వర్మపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు.. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి పై వర్మ కామెంట్స్
