Ramky Ayodhya RamiReddy Won
ఎట్టకేలకు రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి ఎంపీగా గెలిచారు. గతంలో లోక్ సభ కోసం చేసిన పోరులో ఓడినప్పటికీ, పార్టీకి మాత్రం అన్నివేళలా అందుబాటులోనే ఉన్నారు. అందుకే, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే కావడం గమనార్హం. గతంలో లోక్ సభ నుంచి రాంకీ అయోధ్య రామిరెడ్డి పోటీ చేయగా.. టీడీపీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
నాలుగు స్ధానాల్లో వైసీపీ విజయం
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండగా.. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ‘రాంకీ’ అయోధ్య రామిరెడ్డి, రిలయర్స్ గ్రూపునకు చెందిన పరిమళ్ నత్వానీ పోటీ చేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలిచిన నలుగురు అభ్యర్థులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Ysrcp Won Four RajyaSabha Seats