ఎన్నికల కమిషనర్ గా రామసుందర రెడ్డి

RAMSUNDAR REDDY NEW AP EC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమీషనర్ గా తుడా సెక్రటరీ పని చేస్తున్న IAS అధికారి S. రామసుందర రెడ్డి నియామకం. తక్షణం ఈ నియామకం అమలులోకి వస్తుందని ప్రకటించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం. గత ఎన్నికల కమిషనర్ మీద ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోపంగా ఉన్న విషయం తెలిసిందే. పైగా, ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను తమకు తెలియకుండా వాయిదా వేశారని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే, పాత ఎన్నికల సంఘం కమిషనర్ స్థానంలో రామసుందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా సస్పెండ్ చేసిందని సీపీఐ నారాయణ తెలిపారు. గతంలో అహమ్మదాబాద్ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉటంకించింది. అది పాలనా యంత్రాంగానికి వర్తిస్తుంది తప్ప  ఎన్నికల కమిషన్ కు వర్తించదని, ఎన్నికల కమిషన్ పై చర్య తీసుకునే హక్కు పార్లమెంట్ కు తప్ప మరెవ్వరికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చే  అధికారులు లేరా, లేక ఆయన అసలు సలహా వినరా? అని విమర్శించారు.

 

AP LATEST UPDATES

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *