చిరుతో శివగామి?

35
Ramya krisha Act in Chiru movie?
Ramya krisha Act in Chiru movie?

Ramya krisha Act in Chiru movie?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తోంది నటి రమ్యకృష్ణ. డైరెక్టర్లు ఆమె కోసం ప్రత్యేక క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. బాహుబలిలో శివగామి గా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ, త్వరలో మరో పాత్రలో కనిపించనుంది. మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించబోతున్నట్టు సమాచారం. మలయాళంలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణ చేత చేయించాలని అనుకుంటున్నారట. వివి.వినాయక్ ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here