గబ్బర్ సింగ్ తో.. భళ్లాలదేవ

56
Rana work with Pavan kalyan
Rana work with Pavan kalyan

Rana work with Pavan kalyan

`అయ్యప్పనుమ్ కోషియమ్` మలయాళంలో సూపర్ హిట్ సినిమా. సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెలుగులోకి రీమేక్ చేయాలనుకుంటుంది. అయితే హీరో బాలయ్యతో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్మాత భావించినట్లు గతంలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఎందుకోకానీ కుదరలేదు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారు. రీమేక్ మూవీలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం యంగ్ హీరో దగ్గుబాటి రానాను సంప్రదించారట. ఆయన కూడా దాదాపు ఓకే అనబోతున్నట్టు తెలుస్తోంది. పవన్‌తో నటించేందుకు రానా కూడా సిద్ధంగానే ఉన్నాడట. అయితే పవన్-రానా కాంబినేషన్‌ను సమర్థంగా తెరకెక్కించే దర్శకుడి కోసం నిర్మాత వెయిట్ చేస్తున్నారు. మరి అరుదైన కాంబినేషన్ ఏ డైరెక్టర్ తెరకెక్కిస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here