శ్రద్ధగా అందాల రణం చేశారు ప్రేమకథలకీ… రొమాంటిక్ కథలకీ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అత్యంత కీలకం. తెరపైన ఆ జోడీ అందంగానూ.. మంచి ఈక్వేషన్స్‌తోనూ కనిపిస్తేనే కథ రక్తి కడుతుంది. లేదంటే ప్రేమ, రొమాన్స్ వంటి భావోద్వేగాలు పండవు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ మహత్యం ఏమో కానీ.. ఆయన పక్కన ఏ హీరోయిన్ నటించినా సరే కెమిస్ట్రీ అదిరిపోవల్సిందే. నిజ జీవితంలో చాలామంది హీరోయిన్లతో లవ్ ట్రాక్‌లు నడిపిన రణ్‌బీర్ మాస్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ , ఆయన్ని లవర్‌బాయ్‌గానూ చూస్తారు. అందుకు తగ్గట్టుగానే ఆయన తెరపై ఏ హీరోయిన్‌తోనైనా మంచి కెమిస్ట్రీ పండిస్తుంటారు.
ఇక తన అర్థాంగి అలియాలాంటి వాళ్లతో అయితే జోడీ మరింత రక్తి కడుతుంటుంది. ఈసారి ఆయన శ్రద్ధాకపూర్‌తో జోడీ కట్టారు. `తు జూతీ మే మక్కర్` సినిమాకోసం.లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నువ్వు అబద్ధం, నేను సిల్లీ అంటూ అర్థం వచ్చే ఆ సినిమాలో రణ్‌బీర్, శ్రద్ధా జోడీ అదిరిపోయేలా కనిపించనుంది. ఇందులోని తేరే ప్యార్ మే అంటూ సాగే ఓ పాటని ఇటీవలే విడుదల చేశారు. ఆ పాటలో శ్రద్ధా హాట్ హాట్‌గా కనిపించడంతోపాటు, రణ్‌బీర్‌తో కలిసి మంచి రొమాన్స్‌ని పండించింది. ఇదిగో ఫొటోలోకనిపిస్తున్న ఇలాంటి భంగిమలు కుర్రకారుకి మరింత కిక్‌నిస్తున్నాయి. వీళ్లనిక్కడ చూస్తుంటే సినిమాకోసం చాలా శ్రద్ధగా అందాల రణం చేసినట్టున్నారు.