పెళ్లి టైమ్ లోనూ నితిన్ ను వదలని దర్శకుడు

41
rang de trailer
rang de trailer

rang de trailer

కొత్త పెళ్లి కొడుకులా నితిన్ మొహంలో ఆ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన నితిన్.. పెళ్లికి సంబంధించిన పనుల్లో అత్యంత బిజీగా ఉండి కూడా ప్రొఫెషనల్ రెస్పానిబిలిటీని వదల్లేదు. ఈ విషయంలో అతను ఎంతోమంది యంగ్ స్టర్స్ కు ఆదర్శంగా నిలిచాడని చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ నటించిన సినిమా ‘రంగ్ దే’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న మూవీ ఇది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. రంగ్ దే ఇప్పటికే 80శాతం వరకూ టాకీ పూర్తి చేసుకుంది. ఒక రెండు పాటలు, 20శాతం టాకీ పార్ట్ మాత్రం బ్యాలన్స్ ఉంది. అయితే సినిమా టీమ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెలలో రంగ్ దే నుంచి ఓ పాటను విడుదల చేయాలనుకుంటోంది. మరి ఆ పాటలోనిదా లేక ఇంకేదైనా టీజర్ విడుదల చేస్తున్నారా తెలియదు కానీ.. లేటెస్ట్ గా నితిన్ లో ఓ డైలాగ్ పార్ట్ ను డబ్బింగ్ చెప్పించారు. అది కూడా తన పెళ్లికి పక్కాగా రిలేట్ అయి ఉంది. దీంతో ఈ డబ్బింగ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే వైరల్ అయిపోయింది.

‘నాన్నా నవ్వుతుంది నేను కట్టలేను నాన్నా’.. ఇదీ రంగ్ దే కోసం నితిన్ చెప్పిన డైలాగ్. అయితే ప్రస్తుతం అతని పెళ్లి కూడా కావడంతో ఆ యాంగిల్ లోనూ ఈ డైలాగ్ వైరల్ అయిపోతోంది. అయితే ఈ డైలాగ్ చెప్పిన తర్వాత నితిన్ అన్నమాటలు ఫన్నీగా ఉన్నాయి. ‘మారేజ్ టైమ్ లో కూడా తనను ఎంజాయ్ చేయనివ్వకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ తనను టార్చర్ పెట్టారని.. కానీ ఇదంతా ఆడియన్స్ కోసమే చేశాం. రంగ్ దే టీమ్ నుంచి ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పాడు నితిన్. పెళ్లి టైమ్ లో ఎంత టెన్షన్ ఉన్నా.. ఇంత కమిట్మెంట్ చూపించినందుకు థ్యాంక్యూ వెరీ మచ్ స్వామీ అంటూ నితిన్ ఉద్దేశిస్తూ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఓ మాటనేశాడు. మొత్తంగా కుర్రాళ్లంతా కలిసి చేసిన రంగ్ దే మూవీకోసం మిగిలిన పార్ట్ చిత్రీకరణను విదేశాల్లో చేయాలనుకుంటున్నారట. సెప్టెంబర్ నెలలో ఈ టీమ్ విదేశాలకు వెళ్లి అక్కడే మిగిలిన టాకీతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసుకుంటుందట. ఇదే టైమ్ లో నితిన్ కూడా ఓ హనీమూన్ ట్రిప్ లా ప్లాన్ చేసుకుంటున్నాడట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here